Blog
చంద్రునిపై రోవర్ బయటకు వస్తుండగా.. ల్యాండర్ తీసిన మొదటి సెల్ఫీని విడుదల చేసిన ఇస్రో
ఇస్రో శుక్రవారం ఉదయం ల్యాండర్ గురించి ఓ అప్‌డేట్ షేర్ చేసింది. అందులో చంద్రయాన్-3 ల్యాండర్‌ను చంద్రయాన్-2 ఫొటో తీసిందని పేర్కొంది. కానీ, కాసేటికే ఆ ట్వీట్‌ను తొలగించింది. చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపగా.. కొన్ని గంటల తర్వాత అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి తన అన్వేషణ ప్రారంభించింది.
Source link