Blog
చంద్రుడిపై రోవర్ అన్వేషణ షురూ.. రోబోటిక్ పాత్ ప్లానింగ్ కూడా: ఇస్రో ఛైర్మన్
నాలుగేళ్లుగా ఇస్రో శాస్త్రవేత్తల శ్రమకు తగ్గ ఫలితం లభించింది. చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా జాబిల్లి ఉపరితలంపై అడుగుపెట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా చరిత్ర సృష్టించిన ఈ అద్భుత ఘట్టం బుధవారం సాయంత్రం 6.03 గంటల సమయంలో ఆవిష్కృతమైంది. దీంతో యావత్ దేశం పులకించిపోయింది. ఇక, ప్రజ్ఞాన్ రోవర్ నుంచి సమాచారం అందిందని ట్విటర్‌లో ఇస్రో తెలిపింది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఉంటాయని చెప్పింది.
Source link