Blog

చంద్రుడిపైకి నాసా మానవసహిత యాత్ర.. భారత సంతతి వ్యోమగామికి అవకాశం


చంద్రుడిపై మానవసహిత యాత్రకు ప్రణాళికలు రూపొందించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. ఈ యాత్రకు మొత్తం 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. వీరిలో భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి రాజా జోన్ విర్పూత్తూర్ చారి కూడా ఉన్నారు. మొత్తం 18 మందిలో సగానికి సగం మహిళలే కావడం విశేషం. చంద్రుడిపై ఆధునిక అన్వేషణ కార్యక్రమంలో భాగంగా 2024లో తొలుత మహిళలు, తర్వాత పురుషులను పంపుతామని.. దశాబ్దం చివరినాటికి చంద్రునిపై స్థిరమైన మానవ ఉనికిని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఎంపికచేసిన వ్యోమగాములకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.

భారత సంతతి రాజా చారి (43) మాస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని యూఎస్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి డిగ్రీ పూర్తిచేశారు. ఇక, 2017లో నాసా ఎంపిక చేసిన ఆస్ట్రోనాట్ జాబితాలో చారికి చోటుదక్కింది. ఆగస్టు 2017 నుంచి విధుల్లో చేరిన చారి.. వ్యోమగామి ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకోవడంతో మూన్ మెషీన్‌కు ఎంపిక చేసింది.

‘ప్రియమైన అమెరికన్ పౌరులారా.. మనల్ని చంద్రుడు, ఆ వెలుపలకు తీసుకువెళ్లే భవిష్యత్ హీరోలను నేను మీకు పరిచయం చేస్తున్నాను’ అంటూ ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వ్యాఖ్యానించారు. ఎనిమిదో జాతీయ అంతరిక్ష మండలి సమావేశంలో ఆర్టెమిస్ బృందంలోని సభ్యులను పరిచయం చేసిన తరువాత పెన్స్ మాట్లాడారు. ‘ఎంపికచేసినవారిలో మహిళలు కూడా ఉన్నారని చెప్పడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది … గతంలోని గొప్ప హీరోని ప్రతిబింబిస్తూ ఈ రోజు ప్రారంభించాం… ఆర్టెమిస్ జనరేషన్ భవిష్యత్తులో అమెరికా అంతరిక్ష అన్వేషణ వీరులు’అని ఈ సందర్భంగా అన్నారు.

ఆర్టెమిస్ బృందంలోని వ్యోమగాములు విభిన్న నేపథ్యాలు, నైపుణ్యం, అనుభవం నుంచి వచ్చారు. సమూహంలోని చాలా మంది వ్యోమగాములు 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్నారు. అత్యధికంగా 55, అతి తక్కువ 32 ఏళ్లు. ఆర్టెమిస్ బృందాన్ని ప్రకటించిన నాసా.. అనంతరం వ్యోమగాములను పంపే వాహనాల కోసం ప్రకటన చేయనుంది. అంతర్జాతీయ వ్యోమగాములు సహా అదనపు ఆర్టెమిస్ సభ్యులు కూడా ఇందులో ఉంటారు.

ఆర్టెమిస్ కార్యక్రమానికి సహకారం అందించినందుకు, నాసా సైన్స్, ఏరోనాటిక్స్ పరిశోధన, సాంకేతిక అభివృద్ధి అన్వేషణ లక్ష్యాల కోసం ద్వైపాక్షిక మద్దతు ఇచ్చినందుకు , అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టైన్ అన్నారు. అన్వేషణ కోసం ఆర్టెమిస్ బృందాన్ని ప్రకటించడం పట్ల మేము సంతోషిస్తున్నాం.. ఇందులో చంద్రుని ఉపరితలంపై నడబోయే తొలి మహిళ, తదుపరి వ్యక్తి ఉన్నారు అని అన్నారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close