Blog
గ్రహశకలం నుంచే భూమిపైకి జీవం.. శాస్త్రవేత్తలకు ఆధారాలు
జీవుల డీఎన్‌ఏలో ఉండే ప్రోటీన్ల నిర్మాణ ప్రక్రియలో గ్లైసిన్, ఎల్-అలనైన్‌తో సహా పది రకాల అమైనో ఆమ్లాలు గ్రహశకలాలల్లో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో మన భూమిపై జీవానికి మూలాలు గురించి ఆధారాలు దొరికినట్టయ్యింది. నాసా, జపాన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. అతి ప్రాచీనకాలం నాటి ఆస్టరాయిడ్ నమూనాలను అధ్యయనం చేయడం ద్వారా భూమిపై జీవం ఎలా ఏర్పడిందో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు.
Source link