Blog
క్షిపణి పరీక్షల్లో మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా బ్రహ్మోస్ ప్రయోగం
బ్రహ్మాస్ క్షిపణుల సామర్థ్యం పెంచేందుకు డీఆర్‌డీవో ప్రయోగాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించగలవు. తాజా ప్రయోగానికి వినియోగించిన ఐఎన్‌ఎస్ చెన్నై యుద్ధ నౌక 2016 నుంచి తన నౌకాదళానికి సేవలు అందజేస్తోంది. ఇండియన్ నేవీ ప్రాజెక్టు 15Aలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని అభివృద్ధి చేశారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా నౌకదళానికి అప్పగించారు.
మొత్తం 164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువున్న బహుళ ప్రయోజనాలున్న రెండు యుద్ధ హెలికాప్టర్లను తీసుకెళ్లగలదు. ఇది గంటలకు 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు, దేశీయంగా అభివృద్ధిచేసిన యాంటీ సబ్‌మెరైన్ ఆయుధాలు, సెన్సార్లు, భారీ టోర్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు ఈ యుద్ధ నౌకలో ఉంటాయి. సెప్టెంబరు 20 కూడా విస్తృత శ్రేణికి చెందిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు.
తక్కువ పరిధి, ర్యామ్‌జెట్, సూపర్ సోనిక్, క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్‌ను ఉపరితలం, సముద్రం (యుద్ధ నౌకల నుంచి), సముద్రం లోపల నుంచి (జలాంతర్గాముల నుంచి), గాలి నుంచి (యుద్ధ విమానాల ద్వారా) ప్రయోగించవచ్చు. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ , రష్యాకు చెందిన మషినో స్ట్రోయేనియాలు సంయుక్తంగా, బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి, భారత్‌లో ఈ క్షిపణిని తయారు చేస్తున్నాయి. రష్యా క్రూయిజ్ క్షిపణి P-800 ఓనిక్స్ సాంకేతికతపై ఆధారపడి ఈ క్షిపణిని రూపొందించారు. భారత దేశంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కో ఈ రెండు నదుల పేర్లలోని మొదటి భాగాలను కలిపితే ఏర్పడిందే బ్రహ్మోస్.
Source link