Blog
కరోనా వైరస్ ఫొటోను బయటపెట్టిన భారత శాస్త్రవేత్తలు
కంటికి కనిపించని ఓ సూక్ష్మాతి సూక్ష్మజీవితో ప్రపంచం పోరాటం చేస్తోంది. భూమ్మీద జీవులన్నింటిపై ఆధిపత్యం చెలాయించిన మనిషిని ఓ వైరస్ వణికిస్తోంది. చైనాలో పుట్టిన ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోంది. కరోనా అంటే లాటిన్ బాషలో కిరీటం.. మైక్రోస్కోప్‌లో పరీక్షించినప్పుడు ఈ వైరస్ తల మీద కిరీటంలా కనిపించడంతో వైరస్‌కు ఈ పేరు పెట్టారనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చిత్రాలను భారత శాస్త్రవేత్తలు తొలిసారి బయటపెట్టారు.
జనవరి 30న కేరళలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. లేబరేటరీకి పంపిన ఆ పేషెంట్ నమూనాల నుంచి కరోనా వైరస్ చిత్రాన్ని గుర్తించారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడకల్ రీసెర్చ్‌లో SARS-CoV-2కు సంబంధించిన వివరాలను ప్రచురించారు.
భారత్‌లో తొలి మూడు కరోనా కేసులు కేరళలో నమోదు కాగా.. వీరు ముగ్గురూ కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. మార్చి 2న ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. శుక్రవారం నాటికి కోవిడ్ కేసుల సంఖ్య 840 దాటింది.
Source link