Blog

కరోనాకు మందు కనుగొన్న ఫ్రెంచ్ పరిశోధకుడు.. ఆరు రోజుల్లోనే జబ్బు నయం


ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా కరోనా వైరస్ బారిన పడగా.. 13 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మొదట చైనాను అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలను వణికిస్తోంది. కోవిడ్ దెబ్బకు ఇటలీ చిగురుటాకులా వణికిపోతోంది. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 5 వేలకు చేరువలో ఉందంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. ఇటీవలే అమెరికా మనుషులపై తొలిసారిగా పరీక్షలను ప్రారంభించింది.

కాగా ఫ్రెంచ్ పరిశోధకుడు కోవిడ్-19కు సరికొత్త చికిత్సా విధానాన్ని కనిపెట్టారు. ఈ ప్రయోగం ప్రాథమిక దశలో ఉండగా.. ఆరు రోజుల్లోనే ఈ ఔషధం వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుందని తేలింది. ఇన్‌స్టిట్యూట్ హాస్పిటలో యూనివర్సిటైర్‌కు చెందిన ప్రొఫెసర్ డిడిర్ రావౌల్ట్ ఈ ప్రయోగాన్ని చేపట్టారు. కరోనా వైరస్ చికిత్సకు సంబంధించిన పరిశోధన బాధ్యతలను అంటువ్యాధుల నిపుణుడైన రావౌల్ట్‌కు ఫ్రెంచ్ ప్రభుత్వం అప్పగించింది. క్లోరోక్విన్‌తో కోవిడ్ పేషెంట్‌కు చికిత్స చేయగా.. వేగంగా కోలుకున్నాడని.. ఇతరులకు సోకే ముప్పు తగ్గిందని తెలిపారు.

మలేరియా చికిత్సలో ఉపయోగించే క్లోరోక్విన్‌ను ప్లాక్వేనిల్ డ్రగ్ ద్వారా అందించారు. ఇప్పటి వరకూ 24 మంది పేషెంట్లకు ఈ ఔషధంతో చికిత్స అందించగా.. ఫ్రాన్స్‌లో కరోనా బారిన పడ్డ తొలి వ్యక్తికి కూడా ఈ విధానంలో చికిత్స అందించారు. పేషెంట్లకు రోజుకు 600 ఎంసీజీ చొప్పున 10 రోజులపాటు ఈ మందును ఇచ్చి పరిశీలించారు. ప్లాక్వేనిల్ మందు ఇచ్చిన తర్వాత కేవలం 25 శాతం మందిలోనే నిర్ణీత గడువు తర్వాత వ్యాధి వేరే వాళ్లకు సోకుతున్నట్లు గుర్తించారు. క్లోరోక్విన్ ఫాస్ఫేట్, హైడ్రాక్సీక్లోరోక్విన్‌‌లను చైనాలో కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందించడం కోసం వాడగా.. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగిస్తున్నారు.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close