Latest Govt Jobs

ఐఐటీలో ఉద్యోగాలు.. అర్హ‌త ఏంటంటే..?


<![CDATA[

ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లంద‌రూ విల‌విల‌లాడిపోతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృతి చెందారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. భారత్‌లోనూ కరోనావైరస్ రోజుకు రోజుకు తీవ్ర స్థాయిలో విజృంబిస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు లాక్‌డౌన్ అమ‌లు చేసినా.. ఫ‌లితం లేక‌పోవ‌డంతో అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. దీంతో ప‌లు సంస్థ‌లు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.

అయితే బ్యాంక్ ఉద్యోగం కోరుకునేవారికి గుడ్‌న్యూస్ అని చెప్పాలి. ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఉద్యోగుల‌ను భ‌ర్తీ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 39 ఖాళీలున్నాయి. ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. మాస్టర్స్ డిగ్రీ 55% మార్కులతో పాస్ కావాలి. లేదా బీటెక్ పాస్ కావడంతో పాటు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఎంబీఏ డిగ్రీ పాసైనవారికి ప్రాధాన్యత ఉంటుంది.

IHG

 ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 24 చివరి తేదీగా నిర్ణ‌యించింది. అయితే ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఎంపికైన వారిని ఏడాది గడువుతో నియమిస్తారు. పనితీరును బట్టి ఐదేళ్ల‌ వరకు గడువును పొడిగిస్తారు. అస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://home.iitd.ac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close