Latest Govt Jobs

ఏపీలో స్కూళ్లు తెరిచేది ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం!!


<![CDATA[

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రాళ నృత్యం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా భూతం ల‌క్ష‌ల ప్రాణాల‌ను హ‌రించేస్తోంది. కరోనా ప్రభావం ఇంకెన్నాళ్లు ఉంటుందో తెలీక అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. రోజులు త‌ర‌బ‌డి లాక్‌డౌన్ విధిస్తున్నా.. క‌రోనా ఉధృతి ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య కోటి 41లక్షలు దాటింది. అదే స‌మ‌యంలో మృతుల సంఖ్య కూడా ఆరు ల‌క్ష‌ల‌కు చేరువ‌లో నిలిచింది. 

తీవ్ర‌ స్థాయిలో క‌రోనా విజృంభిస్తుతండ‌డంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. మ‌రోవైపు ఈ క‌రోనా దెబ్బ‌కు స్కూళ్లు మూత‌బ‌డ్డాయి.   ప్రభుత్వం పరీక్షలన్నీ వాయిదా వేసింది. కొన్నిటిని ర‌ద్దు చేసింది. పిల్లలంతా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో, స్కూళ్లు మళ్లీ ఎప్పుడు తెరచుకుంటాయో జవాబు లేని ప్రశ్నగా మారింది. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. 

IHG

అయితే కొన్ని విద్యాసంస్థలు మాత్రం జూన్ నెలాఖరు నుంచి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కాని, ఆన్‌లైన్ క్లాసుల‌పై విమర్శలు రావ‌డంతో.. ఏపీ స‌ర్కార్‌ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే స్కూళ్ల మీద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. దీంతో ఇటు ఆన్‌లైన్ క్లాసులు జ‌ర‌గ‌డం లేదు.. అటు స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారో అర్థం కావ‌డం లేదు. అయితే తాజాగా దీనిపై ప్ర‌భుత్వం దాదాపు ఓ క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరిచేందుకు ప్రయత్నిస్తామంటూ కేంద్ర మానవనరుల శాఖకు తెలిపింది. అయితే ఇది ప్రయత్నం మాత్రమే అని.. ప‌రిస్థితుల‌ను బ‌ట్టీ తేదీ మారొచ్చ‌ని వెల్ల‌డించింది.
 
  

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close