Latest Govt Jobs

ఏపీలో ఇంటర్ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..!!


<![CDATA[ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ఒక శుభవార్త తెలిపింది ఏపీ ప్రభుత్వం.. తాజాగా పదవ తరగతి ఇంటర్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్స్ లను విడుదల చేయడం జరిగింది. వీటిని మంత్రి ఆది మూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. ఇక విద్యార్థులు మే 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయట. ఉదయం 9.30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతాయని తెలియజేయడం జరిగింది.

విద్యార్థులు ఎగ్జామ్స్ రాసేందుకు సిద్ధంగా ఉండండి అన్నట్లుగా తెలియజేశారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్ కు రావలసిందిగా మంత్రులు తెలియజేయడం జరిగింది.. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ ను ఏప్రిల్ 8 వ తేదీ నుంచి.. 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వీరిని కూడా కరోనా నిబంధనలను పాటించి ఎగ్జామ్ కు హాజరుకావాల్సిందిగా తెలియజేయడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ నిర్వహించామని విద్యాశాఖ మంత్రి సురేష్ స్పష్టత ఇవ్వడం జరిగింది. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరుగుతాయని మంత్రులు ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. కరోనా నిబంధనల ప్రకారం ప్రస్తుతం స్కూళ్లు కాలేజీలు అన్ని నడుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. ఇక ఎగ్జామ్స్ ను కూడా అలాగే పాటిస్తూ నిర్వహించనున్నారు అని అధికారులకు కూడా తెలియజేశారు.
విద్యార్థులు కచ్చితంగా మాస్క్, శానిటైజర్, వంటివి తీసుకొని ఎగ్జామ్ హాల్ కి వెళ్లాల్సిందిగా తెలియజేశారు. ముఖ్యంగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక దూరం పాటిస్తూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి ఎగ్జామ్ రాయాలి అని తెలియజేశారు. ఇకపోతే గత రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్ గా పాస్ చేసిన విషయం తెలిసిందే ఇక వీరు భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అందుకే ఇప్పటి పిల్లలకు ఎగ్జామ్ నిర్వహించాలని సమాచారం.]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close