Blog
ఈ గుమ్మడి పండు రసం జుర్రేయండి.. అద్బుతమైన ఫోటో షేర్ చేసిన నాసా!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ () ఓ అద్భుతమైన ఫోటోను షేర్ చేసింది. ఇది గుమ్మడి రసం మాదిరిగా ఉంది.. అందుకే దీనిని లాగించేయండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ‘పంప్‌కిన్ స్పేస్ లాటే ఎనీవన్’ అని ఊరించింది. ఇది నక్షత్రాలకు తగినదని పేర్కొంది. ఆస్ట్రనాట్ స్కాట్ కెల్లీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి ఈ ఫోటో తీశారని పేర్కొంది. పాల మీగడ వంటి మేఘాలు, కాలిన నారింజ పండ్ల రంగు, గాఢమైన ఎరుపుదనం కలగలిసి ఓ క్లాసిక్ ఆటమ్న్ డ్రింక్‌ను గుర్తు చేసే ఈ చిత్రంలో కనిపిస్తుంది అని ఆస్ట్రేలియా తెలిపింది. ఇక ఆలస్యం చేయకుండా తాగేయండి అని పేర్కొంది.
ఆరు రోజుల కిందట షేర్ చేసిన ఈ ఫొటోకు ఎనిమిది లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. వేలాది మంది కామెంట్స్ చేశారు. ఇది చాలా అద్భుతంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘స్పేస్ స్పైస్ అండ్ ఆల్ థింగ్స్ నైస్’ఓ యూజర్ చేసిన కామెంట్‌కు నాసా స్పందిస్తూ ఓ స్మైలీ ఎమోజీని పెట్టింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ కూడా ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘‘యెస్ ప్లీజ్! ఐరోపాకు త్వరగా పంపం’ అని కోరింది. దీనిపై నాసా స్పందిస్తూ, ‘కమింగ్ రైట్ అప్’ అని పేర్కొంది.
‘హాలోవీన్ సీజన్ కోసం పర్ఫెక్ట్’ అంటూ ఒకరు.. అద్భుతమని ఇంకొకరు.. చాలా ఇది అందంగా ఉందని మరొకరు.. ఓ మై గాడ్ ఇది అత్యుద్భతం అంటూ ఇలా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే మరికొందరు చంద్రుడిపై నాసా గుర్తించిన నీటి జాడలా అని ప్రశ్నించారు.
Source link