Latest Govt Jobs

ఈఎస్ఐసి మెడికల్ కాలేజీ లో ఉద్యోగాలు…!


<![CDATA[

బెంగళూరు నగరంలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు సంబంధించిన మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీ కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఫారెన్ సిక్ మెడిసిన్ రెండు పోస్టులు, ఫార్మకాలజీ ఒక పోస్ట్, సైకాలజీ ఒక పోస్ట్, అనాటమీ రెండు పోస్టులు, కమ్యూనిటీ మెడిసిన్ రెండు పోస్టులు ఇలా మొత్తం ఎనిమిది ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ప్రక్రియ ఆఫ్ లైన్ ద్వారా జరుగుతుంది. నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ను తీసుకొని అందుకు సంబంధించిన పూర్తి వివరాలను పూరించి, అందుకు తగిన సర్టిఫికెట్లను అందజేయాల్సి ఉంటుంది. చివరగా తగు సర్టిఫికెట్లను జతచేసి డీన్స్ ఆఫీస్, ESIC న్యూ అకాడమిక్ బ్లాక్, ESIC మెడికల్ కాలేజ్ అండ్ PGIMSR రాజాజీ నగర్, బెంగళూరు -560010 కు జూలై 22 వ తారీకు లోపల పంపించాల్సి ఉంటుంది.

IHG

ఈ ఉద్యోగాలకు సంబంధించి భారతదేశంలో ఎక్కడైనా భారత ప్రభుత్వం ఆమోదం పొందిన మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ పట్టా పొంది ఉండాలి. దీంతో పాటు వయస్సు 35 సంవత్సరాలు మించి ఉండకూడదు. అలాగే ఈ ఉద్యోగాలకు నెలకు రూ. 85 వేల వరకు జీతం పొందవచ్చు.

IHG

 

ఈ ఉద్యోగానికి సంబంధించి పూర్తి వివరాల కోసం https://www.esic.nic.in/  ఈ సైట్ ను చూడండి. అలాగే నోటిఫికేషన్ కొరకు https://www.esic.nic.in/attachments/recruitmentfile/318acd690002a548bad7e829489cd154.pdf  ఈ లింక్ క్లిక్ చేయండి.

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close