Latest Govt Jobs
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలివే..
<![CDATA[ఆర్మీలో ఉద్యోగం చేయాలని అనుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్. మీరు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఆర్మీలో ఉద్యోగాల కు సంబందించిన నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు. 191 ఉద్యోగాలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..
ఇండియన్ ఆర్మీ 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ మెన్, 28వ షార్ట్ సర్వీస్ కమిషన్ వుమెన్ కోర్స్ ల కోసం దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాల కు అందరికి సంబంధించినవి కాదు. కేవలం పెళ్లికానీ యువతీ, యువకుల కు మాత్రమే.. ఈ పోస్టుల ప్రక్రియ ఆల్రెడీ మొదలైంది. జూన్ 23 తేదీ చివరి తేదీ. అంటే మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాల ను http://joinindianarmy.nic.in/ వెబ్ సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్ సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఒకటికి రెండుసార్లు పూర్తిగా చదివి, ఈ ఉద్యోగాలకు సెట్ అవుతామా లేదా అన్నది తెలుసుకొని అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు చెన్నై లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు దరఖాస్తులను అందజేయాలి.
ఇకపోతే ఈ ఉద్యోగాలకు విద్యార్హతల విషయాని కొస్తే.. సంబంధిత డిగ్రీ పొంది ఉండాలి. బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ కు డిగ్రీ పూర్తయ్యి ఉండాలి. వయస్సు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.. ఆసక్తి కలిగిన విద్యార్థులు నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోవాలి.. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా చాలా మంది ఈ ఉద్యోగాలను పొందారు. ఇప్పుడు కూడా ఆర్మీ లో చాలా మంది యువకులు ఉత్సహపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా ఆర్మీ లో పనిచేయడం నిజంగా గ్రేట్ భయ్యా.. . ]]>
Source link