Blog

అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత.. అగ్ర రాజ్యాల సరసన


అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన స్క్రామ్‌జెట్ ప్రొపల్షన్ వ్యవస్థను భారత రక్షణ పరిశోధన సంస్థ () విజయవంతంగా పరీక్షించింది. దీంతో ఈ సాంకేతిక కలిగిన అగ్ర రాజ్యాల సరసన భారత్ నిలిచింది. హైపర్ సోనిక్ వేగంతో దూసుకెళ్లే ప్రయోగాత్మక వాహనాన్ని ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్‌లో సోమవారం (సెప్టెంబర్ 7) ఉదయం పరీక్షించింది. అనంతరం డీఆర్‌డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

అత్యాధునిక స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను ఇస్రో డిజైన్ చేయగా.. డీఆర్‌డీవో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఈ సరికొత్త సాంకేతిక ద్వారా అంతరిక్ష ప్రయోగాలు, క్షిపణి ప్రయోగాలను మరింత వేగవంతంగా పూర్తి చేయడానికి అవకాశం కలిగింది. భవిష్యత్తులో ఉపగ్రహ వాహక నౌకలు, క్షిపణులు, అంతరిక్ష, రవాణా విమానాల అభివృద్ధికి స్క్రామ్‌జెట్ ఇంజిన్ ఉపయోగపడుతుంది.

ఈ విజయంతో అంతరిక్ష రంగంలో అన్ని క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాలు తదుపరి దశకు చేరుకున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. డీఆర్‌డీవోను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. తాజా విజయంతో అతిక్లిష్టమైన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించిన దేశంగా భారత్ ఘనత సాధించింది. అమెరికా, రష్యా, చైనా సరసన నిలిచింది.

Also Read:


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close